Sunday, December 22, 2024

ఢిల్లీ హైకోర్టులో సిసోడియా బెయిల్ పిటిషన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) నమోదు చేసిన అవినీతి, మనీ లాండరింగ్ కేసులలో అరెస్టయి తీహార్ జైలులో జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఢిలీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం బెయిల్ కోరుతూ ఢిలీ హైకోర్టును ఆశ్రయించారు. సిసోడియా తరఫు న్యాయవాది గురువారం తాత్కాలిక చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్‌మీట్ పిఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్‌ను ప్రస్తావించగా దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం అంగీకరించింది.

ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తామని, దీనిపై శుక్వారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ ఒక ఎమ్మెల్యే అని తెలిపిన న్యాయవాదులు రజత్ భరద్వాజ్, మొహమ్మద్ ఇర్షాద్ రెండు పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. రెండు కేసులకు సంబంధించి సిసోడియా దాఖలు చేసిన పిటిషన్లను దిగువ కోర్టు ఏప్రిల్ 30న కొట్టివేయగా ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News