- Advertisement -
బిఆర్ అంబేద్కర్‌కు అవమానం వివాదం నుంచి దృష్టి మళ్లించే యత్నంగా ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా ఆరోపిస్తూ, ఎల్‌జి అనుమతి పత్రం నకలు చూపించవలసిందిగా ఇడిని కోరారు. ‘అర్వింద్ కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చినట్లయితే, ఆ అనుమతి పత్రం నకలును ఇడి ఎందుకు చూపడం లేదు? ఆ వార్త అసత్యం అని, తప్పుదారి పట్టించేది అని స్పష్టం అవుతోంది. బాబా సాహెబ్‌కు అవమానం సమస్యపై నుంచి దృష్టి మళ్లించేందుకు తప్పుడు వాగ్దానాలు చేయడం మానండి’ అని సిసోడియా అన్నారు. ఎల్‌జి మంజూరు చేసిన అనుమతి కాపీని చూపవలసిందిగా ఇడిని ఆప్ ముఖ్య అధికార ప్రతినిధి ప్రియాంక కక్కడ్ కూడా కోరారు.
- Advertisement -