Monday, January 20, 2025

17 వరకూ ఇడి కస్టడీకి సిసోడియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను ఈ నెల 17 వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీకి తరలించారు. ఎక్జైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ వ్య వహారాల పేరిట ఒక్కరోజు క్రితమే ఇడివర్గాలు ఆ యనను విచారించాయి. తరువాత అరెస్టు చేశా యి. శుక్రవారం ఉదయం ఆయనను ప్రత్యేక న్యా యమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఎదుట హాజరుపర్చా రు. ఆయనను అనుమతించేందుకు ఇడికి అనుమతించిన న్యాయమూర్తి ఈ నెల 17 వరకూ కస్టడికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రాంగణంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశా రు.

సిబిఐ కస్టడీలో బెయిల్ దరఖాస్తు విచారణ దశలోనే ఇడి అరెస్టు చేయడాన్ని సిసోడియా తరఫు లాయర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. విచారణ దశలో సిసోడియా తమకు సహకరించడం లేదని, పలు ప్రశ్నలకు పొంతనలేని స మాధానాలు ఇచ్చారని ఇడితరఫు లాయర్లు తెలిపా రు. దీనితో నిజాలు రాబట్టుకునేందుకు మరింతగా ఆయన విచారణ అవసరం అని, అందుకే అరెస్టు చేశామని, స్కామ్‌కు ప్రధాన సూత్రధారులను కనుగొనేందుకు, సిసోడియాను ఇతర నిందితులతో కలిపి విచారించేందుకు అవకాశం కల్పించాలని ఇడి కోరింది. దర్యాప్తు క్రమంలో అత్యంత కీలకమైన సిసోడియా ఫోన్ ధ్వంసం చేశారని, దీనిపై విషయాలను నిర్థారణ చేసుకోవల్సి ఉందని ఇడి తరఫు న్యాయవాది జోహెబ్ హోస్సెన్ తెలిపారు. అయితే ఇడి వాదనను సిసోడియా తరఫు లాయర్ల బృందం తోసిపుచ్చింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ప్రస్తుత వివాదానికి దారితీసిందని అనుకుంటే, పాలసీకి ఆమోదం తెలిపిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూ డా విచారించాల్సి ఉందని సిసోడియా తరఫు న్యా యవాదులు దయాన్ కృష్ణన్, మోహిత్ మాథుర్, సిద్ధార్థ్ అగర్వాల్ చెప్పారు. ఓ విధాన నిర్ణయాన్ని ఇడి వర్గాలు మనీలాండరింగ్ పరిధిలోకి తీసుకురావడం దారుణం అని పేర్కొన్నారు. ఇంతకు ముం దు జరిపిన సోదాలలో తమ క్లయింట్ వద్ద నుంచి అక్రమ ధనం ఓ పైసా కూడా దొరకలేదని, కేవలం ప్రచారంలో ఉన్న అంశాల ప్రాతిపదికన కేసును సిద్ధం చేశారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News