దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఆప్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పిలుపునిచ్చారు. ఎక్సైజ్ కుంభకోణం కేసులో శుక్రవారం బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ రాజ్యాంగాని కన్నా బిజెపి నాయకులు ఏమీ శక్తివంతులు కారని అన్నారు. ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపడమే కాకుండా ప్రజలను వేధిస్తున్న నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తాను జైలులో ఉండగా తనకు బెయిల్ లభించడం గురించి తాను ఆందోళన చెందలేని, కాని బిజెపికి విరాళాలు ఇవ్వలేదన్న కారణంతో వ్యాపారులను తప్పుడు కేసులలో జైలు పాలు చేయడం తనను బాధించిందని ఆయన అన్నారు. ఇదే తనతోపాటే జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశంలో నిజాయితీకి చిహ్నమని ఆయన అన్నారు.
కేజ్రీవాల్ చేసిన మంచి పనులను అప్రతిష్టపాల్జేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులంతా ఐక్యమైతే కేజ్రీవాల్ 24 గంటల్లో జైలు నుంచి విడుదలవుతారని ఆయన ప్రకటించారు. మనమంతా కేవలం రథాన్ని లాగే అశ్వాలు లాంటి వారమని, నిజమైన సారథి త్వరలో జైలు నుంచి వస్తారని ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. తన బెయిల్ తీర్పును ప్రస్తావిస్తూ నియంతృత్వాన్ని అణచివేయడానికి సుప్రీంకోర్టు నిన్న రాజ్యాంగానికి ఉన్న శక్తిని ఉపయోగించిందని సిసోడియా తెలిపారు. డు లేక ఎనిమిది నెలల్లో తనకు న్యాయం లభిస్తుందని భావించానని, కాని అందుకు 17 నెలలు పట్టిందని ఆయన అన్నారు. అయితే చివరకు సత్యమే గెలిచిందని ఆయన తెలిపారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ పేనును నేరుగా ప్రస్తావించకుండా బిజెపి నాయకుడికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఒలింపిక్స్‌లో ఏం జరిగిందో ప్రజలు చూశారని సిసోడియా వ్యాఖ్యానించారు.