Friday, December 20, 2024

ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియాకు సిబిఐ సమన్లు

- Advertisement -
- Advertisement -

Manish Sisodia

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియాకు శుక్రవారం భారీ షాక్ తగిలింది. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సిబిఐ అధికారులు సిసోడియాకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే ఈ కేసుపై సిబిఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన అభిషేక్ రావును సిబిఐ అధికారులు ఏకంగా 5 రోజుల పాటు విచారించారు. ఈ విచారణ ముగిసిన మరునాడే సిసోడియాకు సిబిఐ అధికారులు సమన్లు జారీ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News