Sunday, December 22, 2024

మే 23 వరకు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో… ఈడి కేసులో ఆప్ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 23 వరకు పొడగించింది. మనీశ్ సిసోడియా అనేకసార్లు పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనలు తిరస్కారానికి గురయ్యాయి. సిసోడియా ఇదివరలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్, ఆ తర్వాత తన భార్య అనారోగ్యంతో ఉన్న కారణంగా తాత్కాలిక బెయిల్‌కు అభ్యర్థన పెట్టుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఆయనను సిబిఐ ఫిబ్రవరి 26న, ఈడి మార్చి 9న అరెస్టు చేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News