Friday, December 20, 2024

మిస్టర్ ఎక్స్ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరోలు ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ మిస్టర్ ఎక్స్. మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనఘ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జరిగాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మిస్టర్ ఎక్స్’ యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News