- Advertisement -
హైదరాబాద్: మంజుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే మంజుల హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య కేసులో రిజ్వానాను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కొన్నాళ్ల క్రితం రిజ్వానాకు మంజుల లక్ష రూపాయల అప్పు ఇచ్చింది. డబ్బు అడిగేందుకు ఈ నెల 10న రిజ్వానా ఇంటికి మంజుల వెళ్లింది. అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో మంజుల-రిజ్వానా మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో మంజుల కంట్లో రిజ్వానా కారం చల్లింది. తన చీరకొంగుతో మంజులకు రిజ్వానా ఉరివేసింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని రిజ్వానా పారిపోయింది. అర్థరాత్రి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించింది.
- Advertisement -