Wednesday, January 1, 2025

యమునలో మన్మోహన్ అస్థికల నిమజ్జనం

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు సిక్కు ఆచారాలు పాటించిన అనంతరం మజ్ఞూ కా తిల గురుద్వారా సమీపంలో యమునా నదిలో నిమజ్జనం చేశారు. సింగ్ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం నిగమ్‌బోధ్ ఘాట్ నుంచి అస్థికలను సేకరించి, ఆతరువాత గురుద్వారా సమీపంలోని యమునా నది తీరాన ‘అస్థ్ ఘాట్’కు తీసుకువెళ్లారు. సింగ్ భార్య గురుశరణ్ కౌర్, వారి ముగ్గురు కుమార్తెలు ఉపీందర్ సింగ్, దామన్ సింగ్, అమృత్ సింగ్ ఇతర బంధువులతో పాటు నిమజ్జన స్థలంలో ఉన్నారు. సిక్కు ఆచారాల్లో భాగంగా కుటుంబం జనవరి 1న తమ అధికార నివాసం నం.3, మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో ‘అఖండ్ పఠ్’ నిర్వహిస్తారు.

3న పార్లమెంట్ సముదాయం సమీపంలోని రకబ్ గంజ్ గురుద్వారాలో భోగ్ ఉత్సవం, అంతిమ్ అర్దాస్, కీర్తన్ నిర్వహిస్తారు. ఇది ఇలా ఉండగా, మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం సమయంలో గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం శోచనీయమని బిజెపి నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా అన్నారు. ‘ఇది మన అందరికీ విషాద క్షణం. అయితే, గాంధీ కుటుంబం నుంచి ఆదివారం ఎవ్వరూ రాకపోవడం నిజం. ఈరోజు అక్కడ కెమెరా ఏదీ లేనప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవ్వరూ లేరు. ఇది విచారకరం, మన్మోహన్ సింగ్ ఎంతగానో గౌరవనీయుడు’ అని సిర్సా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News