Monday, December 23, 2024

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి సరైనదే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ అనుసరించిన తీరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమర్ధించారు. యుద్ధం విషయంలో భారత్ చూపించిన స్వతంత్ర వైఖరి సరైనదేనన్నారు. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి భారత్ చాలా మంచి పని చేసిందని కొనియాడారు. ఇదే సమయంలో శాంతిని నెలకొల్పే ఆవశ్యకతను ప్రస్తావించినట్లు తెలిపారు.

ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ ఈ విధంగా మాట్లాడారు. రెండు లేదా అంతకంటే ఎక్కవ దేశాల మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు ఏదో ఒకదానికి మద్ధతుగా ఉండటం దేశాలకు చాలా కష్టమైన విషయమని, అయితే ఈ విషయంలో దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఇండియా తీసుకున్న వైఖరి సరైనదేనని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇండియా జి.20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

నా జీవిత కాలంలో ఇండియాకు జి20 సారథ్య బాధ్యతలు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. జి 20 దేశాధినేతలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడాన్ని నేను చూస్తున్నానని.. అలాగే భారత పాలన నిర్మాణంలో విదేశాంగ విధానం చాలా కీలకమైనదని చెప్పారు. అయితే ఇది ప్రస్తుతం పార్టీల స్వప్రయోజనాలకు కీలకమైన అంశంగా మారిపోయినట్లు వివరించారు. తన హయంలో పార్టీ రాజకీయాల కంటే విదేశాంగ విధానానికే అత్యధిక ప్రాధాన్యం ఉండేదని పేర్కొన్నారు. అలాగే ఈ దౌత్యం విషయంలో పార్టీ రాజకీయాలకు వాడుకునే విషయంలో సంయమనం పాటించడం ముఖ్యమని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News