Saturday, December 28, 2024

ఆర్థికవేత్తకు అశ్రునివాళి

- Advertisement -
- Advertisement -

నిరాడంబరుడికి నివాళులర్పించిన కేంద్ర కేబినెట్ నేడు ఉదయం 11.45 గంటలకు న్యూఢిల్లీలోని నిగంబోథ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో
అంత్యక్రియలు జనవరి 1 వరకు సంతాప దినాలు మన్మోహన్ కోసం స్మారక స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ
సమాధానమివ్వని ప్రభుత్వం దేశగతిని తీర్చిదిద్దిన మన్మోహన్‌కు శ్రద్ధాంజలి ఘటించిన సిడబ్లూసి దేశం సిసలైన రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని
సిడబ్లూసి సంతాప తీర్మానం జనం, అభివృద్ధ్ది పట్ల ఆయన నిబద్ధత సదా స్మరణీయం: వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మన్మోహన్ నాకు
మిత్రుడు.. తత్వవేత్త.. మార్గదర్శకుడు: సంతాప సందేశంలో సోనియా గాంధీ దేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేటి ఉదయం ఎఐసిసి కార్యాలయానికి మన్మోహన్ పార్థివదేహం.. నివాళులర్పించనున్న కాంగ్రెస్ శ్రేణులు ఉ.9.30 గం.కు అంతిమయాత్ర

దేశాన్ని అజేయమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దడానికి అవసరమైన పునాదులు పరిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు జాతి యావత్తు గురువారం రాత్రి కన్నూమూసిన ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడికి కేంద్ర కేబినెట్ అంజలి ఘటించింది. ఆయన తెచ్చిన సంస్కరణలు దేశానికి వన్నె తెచ్చాయని శ్లాఘించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను కొనియాడింది. మన్మోహన్ స్మారకం కోసం ఢిల్లీలో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై ఎలాంటి స్పందనలు తెలియజేయని కేంద్రం ఢిల్లీలోని నిగంబోథ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు జాతీయ నేతలు పుష్పాంజలి ఘటించారు. ప్రపంచ దేశాల అధినేతలు సంతాప సందేశాలు పంపించారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్యమంత్రులు మన్మోహన్ పార్థివ దేహానికి అంజలి ఘటించారు.

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు శుక్రవారం ఆయన నివాసంలో శ్రద్ధాంజలి ఘ టించిన ప్రముఖుల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కాం గ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఉ న్నారు. పూర్వపు ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి భారీ నష్టమని అభివర్ణించిన ప్రధాని మోడీ ప్రజలు, దేశం అభివృద్ధి పట్ల ఆయన అంకితభా వం సదా గౌరవనీయమని అన్నారు. దేశ విభజన దరిమిలా సర్వం వదలి తన కుటుంబంతో భారత్ కు వలస వచ్చిన తరువాత మన్మోహన్ జీవిత ప్రస్థానాన్ని మోడీ ఒక వీడియో సందేశంలో గుర్తు చేసుకున్నారు. ఆతరువాత మన్మోహన్ సాధించిన అసంఖ్యాక విజయాలు తక్కువేమీ కాదని మోడీ పేర్కొన్నారు. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, జటి ల రాజకీయ ప్రపంచంలో ఏకాభిప్రాయ సాధన కర్త మన్మోహన్ సింగ్ 92వ ఏట గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మ రణం పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపం వ్యక్తం చే సింది. మన్మోహన్ సింగ్‌ను ప్రముఖ రాజనీతిజ్ఞుడి గా, జాతి జీవనంపై చెరగని ముద్ర వేసిన విశిష్ట నేతగా మంత్రివర్గం కొనియాడింది. మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్గం దివంగత నేల గౌరవార్థం రెండు నిమిషాలు మౌనం పాటిం చి, ఆయన సంస్మరణార్థం సంతాప తీర్మానాన్ని ఆ మోదించింది.

‘డాక్టర్ మన్మోహన్ సింగ్ మన జాతి జీవనంపై చెరగని ముద్ర వేశారు. ఆయన మరణంతో దేశం సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుని, ప్రముఖ ఆర్థికవేత్తను, విశిష్ట నేతను కోల్పోయింది’ అని మంత్రివర్గం సంతాప తీర్మానంలో పేర్కొన్నది. మాజీ ప్ర ధాని పట్ల గౌరవ సూచకంగా వారం సంతాప దినాలను ప్రభుత్వం ప్రకటించింది. త్రివర్ణ పతాకం క ప్పిన మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని లుటియెన్స్ ఢిల్లీలోని ఆయన నంబర్ 3, మోతీలాల్ నెహ్రూ రోడ్ నివాసం సువిశాల బంగళాకు తీసుకువచ్చా రు. ఆ భవనం పది సంవత్సరాలకు పైగా ఆయన నివాసంగా ఉన్నది. మన్మోహన్ సింగ్ సతీమణి గు రుశరణ్ కౌర్, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో మాజీ ప్రధానికి వివిధ పార్టీల నేతలు తమ అం తిమ నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర శనివారం ఉదయం 9.30 గంటలకు ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి మొదలవుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, కేం ద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కూడా నివాళులు అర్పించా రు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వా ద్రా కూడా మన్మోహన్ సింగ్ నివాసంలో ఉన్నారు. మన్మోహన్ మృతికి ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె సంతాపం వ్యక్తం చేశారు.

గాహ్ గ్రామంలో జన్మించిన మాజీ ప్రధాని
అవిభక్త భారత్ (ప్రస్తుత పాకిస్తాన్)లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గాహ్ గ్రామంలో 1932 సెప్టెంబర్ 26 న గుర్ముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు జన్మించిన మన్మోహన్ సింగ్ 1948లో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసయ్యారు. ఆయన విద్యా ప్రస్థానం పంజాబ్ నుంచి యుకె కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి సాగింది. ఆయన అక్కడ ఎకనామిక్స్‌లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ డిగ్రీ పొందారు. సింగ్ అటుపిమ్మట ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నఫీల్డ్ కాలేజి నుంచి ఎ కనామిక్స్‌లో డిఫిల్ చేశారు. మన్మోహన్ సింగ్‌కు త న అమ్మమ్మ అంటే ఎంతో అభిమానం ఉండేదని, ఆయన పిన్న వయస్సులో తల్లి మరణం తరువాత ఆయనను ఆమె పెంచారని ఆయన సవతి సోదరుడు సుర్జీత్ సింగ్ కోహ్లి తెలియజేశారు. భారత్‌కు వలస వచ్చిన తరువాత సింగ్ పట్టభద్రుదు అ య్యేంత వరకు ఆయన కుటుంబం అమృత్‌సర్‌లో ఒక చిన్న అద్దె ఇంటిలో స్థిరపడింది. కొన్ని సంవత్సరాల క్రితం సింగ్ అమృత్‌సర్ హిందు కళాశాలలో స్నాతకోత్సవం, పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, ఒక సామాన్యునిలా సి బ్బందితో మాట్లాడారని, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారని హిందు కళాశాల విశ్రాంత ప్రొఫెస ర్ రాజీందర్ లూంబా తెలియజేశారు.

సింగ్ స్వర్ణ మందిరం సమీపంలోని పెఠా వాలా బజార్‌లో నివసిస్తుండేవారని అమృత్‌సర్ వాసి రాజ్ కుమార్ (71) ‘పిటిఐ వీడియోస్’తో చెప్పారు. సింగ్ కుటు ంబం నివసించిన ఇల్లు ఇప్పుడు పాడుపడిపోయి ఉందని కుమార్ తెలిపారు. సింగ్ అమృత్‌సర్ గు రించి ఎప్పుడూ శ్రద్ధ వహిస్తుండేవారని, ఆయన సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం నగరానికి పలు ప్రాజెక్టులు మంజూరు చేసిందని కొందరు స్థానికు లు తెలియజేశారు. ఆయన మరణంతో వివిధ రం గాలకు చెందినవారు ఆయన గురించిన తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఒక క్యాంపస్ కార్యక్రమంలో సింగ్‌గకు నల్ల జెండాలు చూపిప విద్యార్థులపై చర్య తీసుకోకుండా అధికార యంత్రాంగా న్ని పిఎంఒ ఎలా నిలువరించిందోనటి, జెఎన్‌యు పూర్వ విద్యార్థిని స్వర భాస్కర్ గుర్తు చేసుకున్నా రు. సింగ్ హయాంలో ఎస్‌పిజి అధికారిగా సుమా రు మూడు సంవత్సరాలు ఆయనకు సన్నిహిత రక్ష ణ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన ఉత్తర ప్రదే శ మంత్రి అసిమ్ అరుణ్ తన అనుభవాలను పంచుకుని, ఆయన వ్యక్తిత్వం ఎటువందితో చెప్పారు. సింగ్‌ది సాదా సీదా జీవన సరళి అని, సామాన్యుని తో అనుబంధం ఉండేదని అసిమ్ అరుణ్ పేర్కొన్నా రు.

సింగ్‌ది ఎటువంటి సాధారణ మనస్తత్వమో కూడా అరుణ్ చెప్పారు. ఆయనకు సొంతకారు మారుతి సుజుకి 800తో అనుబంధం ఉండేదని అరుణ్ చెప్పారు. అధికార ప్రయాణానికి విలాసవంతమైన బిఎండబ్లు కారు సహా అధిక భద్రత గ ల వాహన సముదాయం ఉన్నప్పటికీ సింగ్ ఆ మా రుతి కారు పట్ల తన ఇష్టాన్ని తరచు వ్యక్తం చేస్తుండేవారని అరుణ్ తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపు ఇచ్చిన తరువాత 2004 నుంచి 2014 వరకు పది సంవత్సరాలు దే శానికి సారథ్యం వహించిన సింగ్ ప్రపంచ ఆర్థిక, వాణిజ్య రంగాల్లో సుప్రసిద్ధ నేతగా ఖ్యాతి గడించా రు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News