Sunday, December 29, 2024

సంస్కర్తకు సెలవు

- Advertisement -
- Advertisement -

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఢిల్లీలోని
ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్‌బోథ్ ఘాట్
వరకు అంతిమయాత్ర భారీ సంఖ్యలో హాజరైన
అభిమానులు నివాళులర్పించిన భూటాన్ రాజు
వాంగ్‌చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనుంజయ్
రాంపూర్ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని తదితరుల
సమక్షంలో అంతిమ సంస్కారాలు చితికి
నిప్పంటించిన పెద్ద కుమార్తె ఉపీందర్ ‘స్మారక
స్థలం’పై వివాదం మన్మోహన్‌ను మోడీ ప్రభుత్వం
అవమానించిందని రాహుల్ ఆరోపణ కాంగ్రెస్
రాజకీయం చేస్తోందని బిజెపి నిరసన స్థలం
కేటాయిస్తాం: హోం శాఖ

ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్
సింగ్ అంత్యక్రియలు చితికి నిప్పు
అంటించిన పెద్ద కుమార్తె ఉపీందర్
ఎఐసిసి హెడ్‌క్వార్టర్స్ నుంచి నిగమ్
బోధ్ ఘాట్‌కు చేరుకున్న పార్థివ దేహం
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని
ప్రభృతుల సమక్షంలో అంత్యక్రియలు
భూటాన్ రాజు వాంగ్‌చుక్ నివాళులు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి శనివారం ఢిల్లీ నిగమ్‌బోధ్ ఘాట్ వద్ద వేద మంత్రోచ్చాటనల మధ్య అంత్యక్రియలు జరిగా యి. మన్మోహన్ సింగ్ పెద్ద కుమార్తె ఉపీందర్ సింగ్ ఆ యన చితికి నిప్పు అంటించారు. రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మో డీ, ఇతర అగ్ర నేతలు, విదేశీ ప్రముఖుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వర్తించారు. భూటాన్ రాజు జిగ్మె ఖేసర్ నంగ్యెల్ వాంగ్‌చుక్, మారిషస్ విదేశాంగ శాఖ మంత్రి ధనంజయ్ రామ్‌ఫుల్ తదితర విదేశీ ప్రముఖు లు సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీతో పాటు మాజీ ప్రధానికి తమ అంతిమ నివాళలు అర్పించిన అగ్ర నేతల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా, ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. రక్షణ దళాల ప్రధానాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు కూడా సింగ్‌కు తమ అంతిమ నివాళులు అర్పించారు. సింగ్ పార్థివ దేహంతో ఊరేగింపు ఉదయం సుమారు 11.30 గంటలకు శ్మశానవాటికకు చేరింది.

ఆ తరువాత కొద్ది సేపటికే అంత్యక్రియలు నిర్వర్తించారు. త్రివర్ణ పతాకం కప్పిన, పుష్పాలంకరణ చేసిన శవపేటికను ఎత్తైన వేదికపైకి చేర్చారు. పార్టీలతో నిమిత్తం లేకుండా నేతలు సింగ్ పార్థివ దేహానికి పు ష్పాంజలి ఘటించారు. అంతకు ముందు ఎఐసిసి ప్రధా న కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు తమ ప్రియతమ నే తకు శ్రద్ధాంజలి ఘటించిన తరువాత సింగ్ అంతిమ యాత్ర అక్కడి నుంచి బయలుదేరింది. సింగ్ భౌతికకాయంతో వాహనం ‘మన్మోహన్ సింగ్ అమర్ రహే’ నినాదాల మధ్య ఊరేగింపుగా కాంగ్రెస్ ప్రధాన కార్యాల యం నుంచి బయలుదేరింది. ‘జబ్ తక్ సూరజ్ చాండ్ రహేగా, తబ్ తక్ తేరా నామ్ రహేగా’ నినాదాలు మి న్నంటుతుండగా అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, వందలాది మంది సింగ్ శ్రేయోభిలాషులతో పా టు నడిచారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రా హుల్ గాంధీ కూడా సింగ్ బంధువులతో కలసి ఊరేగిం పు వెంట సాగారు. సింగ్ పార్థివ దేహాన్ని ఉదయం 9కి కొంత ముందుగా ఆయన 3, మోతీలాల్ నెహ్రూ నివా సం నుంచి ఎఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. సింగ్ భార్య గురుశరణ్ కౌర్, వారి కుమార్తెల్లో ఒకరు ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News