- Advertisement -
అధికారికంగా సైనిక లాంఛనాలతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయనకు త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులు నివాళులర్పించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నుంచి అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం నిగమ్‌బోధ్ ఘాట్ లో ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో ఉపరాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ,మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, భూటాన్ రాజు కేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, సిఎంలు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -