Sunday, November 24, 2024

ఊహించని భాగ్యం దక్కింది.. ప్రధాని నా గురించి మాట్లాడటం మర్చిపోలేను

- Advertisement -
- Advertisement -

ఊహించని భాగ్యం దక్కింది
ప్రధాని నా గురించి మాట్లాడటం మర్చిపోలేను
పది మందికి నా కళను నేర్పిస్తా: చేనేత కార్మికుడు హరి ప్రసాద్
హరిప్రసాద్‌ను ఘనంగా సన్మానించిన బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: మన్ కి బాత్ కార్యక్రమంలో తన చేతితో స్వయంగా నేసిన జీ 20 వస్త్రాన్ని చూపిస్తూ తన పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించడాన్ని ఊహించని భాగ్యం దక్కినట్లు భావిస్తున్నట్లు సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ చెప్పారు. ఆదివారం టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూస్తూ హరిప్రసాద్ ఉబ్బితబ్బిబైపోయాడు. అనంతరం రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు ఆడెపు రవీంద్రతో కలిసి కరీంనగర్‌లో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హరిప్రసాద్ కలిశాడు. ఈ సందర్బంగా హరిప్రసాద్‌ను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు.

ప్రధాని స్ఫూర్తితో కనుమరుగవుత్నున చేనేత కళను పది మందికి నేర్పించాలని ఉందని హరిప్రసాద్ పేర్కొనడంతో వెంటనే స్పందించిన బండి సంజయ్ శేభాష్ అంటూ అభినందించారు. పది మందికి చేనేత కళను అందించేందుకు పూనుగోవడం గొప్ప విషయమని అన్నారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు, ఆర్ధికసాయం చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News