Friday, November 22, 2024

ఏ సర్వే చూసినా బిజెపికే మొగ్గు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సమాజానికి స్ఫూర్తి నిచ్చేలా మన్ కీ బాత్ నిర్వహించడం గొప్ప విషయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం బంజారాహిల్స్ ఉదయ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టిఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సిహెచ్.విఠల్, సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్‌రావు, బద్దం మహిపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, రాఘవరావులతో ఆయన హాజరయ్యారు. బస్తీకి చెందిన ప్రజలంతా మన్ కీ బాత్ కార్యక్రమానికి హాజరై ప్రధాని మోడీ ప్రసంగాన్ని విన్నారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పిలుపుతో 140 కోట్ల మందిని ఇంట్లోనే ఉంచి కరోనాను కట్టడి చేసిన ఘనత మన్ కీ బాత్ దే అన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే మీడియాను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుంటే జర్నలిస్టు సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సచివాలయంలో మార్పులు చేసిన తరువాతే అందులో అడుగుపెడతానని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Also Read: గ్రామస్థులు పోలీసుల మధ్య ఘర్షణ

ఏ సర్వే చూసినా బిజెపి అధికారంలోకి రాబోతోందని నివేదికలున్నయ్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయంగా మారింది. మేం సింగిల్ గానే పోటీ చేస్తాం.. సింగిల్ గానే అధికారంలోకి వస్తాం… ప్రజాస్వామ్యబద్దంగా పాలన కొనసాగిస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News