Friday, December 20, 2024

సిఎం రేవంత్ రెడ్డికి మన్నె క్రిశాంక్ ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఛాలెంజ్ చేశారు. చిత్రపురి సొసైటీలో మూడు వేల కోట్ల భూదందా చేసిన అనుముల మహానంద రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఆధారాలతో చూపిస్తానని మన్నె క్రిశాంక్ తెలిపారు. దమ్ముంటే అది తప్పని రేవంత్ రెడ్డి కోర్టుకి వచ్చి నిరూపించగలడా? అని బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని ఒక పత్రిక రాస్తే దాని మీద కేసు వేశారన్నారు. అక్రమ భూదందా గురించి మాట్లాడితే తన మీద కేసు వేసి, తన ఫోన్ సీజ్ చేశారని ఆరోపించారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయని మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News