హైదరాబాద్: హెచ్ సియు భూముల విషయంలో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు గచ్చి బౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. తాము విడుదల చేసి వీడియోలలో ఎక్కడా కూడా ఎఐని వాడలేదని, హెచ్ సియు భూముల విషయంలో విడుదల చేసిన వీడియోలు, ఫొటోలు నిజమేనని క్రిశాంక్ స్పష్టం చేశారు. జింకలు రోడ్ల మీద తిరగడం, స్థానికులు ఇళ్లలోకి వెళ్లే వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అక్కడ జింకలు లేవు నక్కలు ఉన్నాయని అన్నారని, ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు పెట్టడంతో ప్రభుత్వం భయపడుతుందనేది అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
ఎఐతో వీడియోలు క్రియేట్ చేశామనడం పచ్చి అబద్ధమని, ఎఐ గురించే మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని క్రిశాంక్ చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రూ.20 వేలు ఇచ్చి సామాజిక మాద్యమాల్లో రీల్స్ చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు. హెచ్ సియు భూముల విషయంలో విధ్యార్థులు ఆందోళనకు దిగడంతో వారిపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేసి విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు హెచ్ సియు భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్లవద్దని హెచ్చరించిన విషయం విధితమే.