Thursday, January 23, 2025

పాట వింటే హృదయం ద్రవిస్తుంది

- Advertisement -
- Advertisement -

Director Raghavendra Rao Act In Tanikella Bharani Movie

అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. నల్లమల అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేపథ్యంలో ఆసక్తికర కథా కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్.ఎం. నిర్మాత. ఈ మూవీలోని సిద్ శ్రీరామ్ పాడిన ‘ఏమున్నవే పిల్లా’ సాంగ్ మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రంలోని ‘మన్నిస్తారా మూగజీవులారా’ పాటను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్ర రావు మాట్లాడుతూ “దర్శకుడు రవిచరణ్ ‘మన్నిస్తారా’ పాటను చాలా బాగా చిత్రీకరించాడు. ఈ పాట ప్రతి లైన్ విని అర్థం చేసుకుంటే హృదయం ద్రవిస్తుంది. జంతువుల పట్ల ఎంత అమానుషంగా ఉంటున్నామో తెలుస్తుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News