Monday, January 20, 2025

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన ఫిబ్రవరి 21 న హిందూజా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. జోషి 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2002 నుండి 2004 వరకు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు.  2006 నుండి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1999 నుండి 2002 వరకు భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News