Sunday, December 22, 2024

ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: లోక్ సభ ఎన్నికల సమయంలో హర్యానా రాజకీయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు అందజేశారు. ఖట్టర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం హర్యానాకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. ఖట్టర్ రాజీనామా చేయడంతో హర్యానా రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. బిజెపి అధిష్ఠానం సూచన మేరకు ఆ పార్టీ ఎంఎల్‌ఎలు మరో ముఖ్యమంత్రిని ఏకగీవ్రంగా ఎన్నుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News