Monday, December 23, 2024

ఆర్‌జివి నన్ను తిడతాడండీ: మనోజ్ బాజ్‌పేయి

- Advertisement -
- Advertisement -

ముంబై: ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే నటుడు మనోజ్ బాజ్‌పేయి. అతడి డైలాగ్ డెలివరీ, హావభావాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అభిమానులు అతడి నటనను మెచ్చుకుంటుంటారు. ఆయన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్‌జివి)తో కూడా కలిసి అనేక సినిమాల్లో పనిచేశారు. ఇటీవల ఆయన ‘గుల్‌మోహర్’సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఆర్‌జివికి ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు.

ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్‌పేయి తాను ఇప్పటికీ ఆర్‌జివితో టచ్‌లో ఉన్నానన్నారు. తరచూ తాము మాట్లాడుకుంటుంటామన్నారు. ‘ఒక్కోసారి ఆర్‌జివి నన్ను తిట్టేస్తుంటాడండీ బాబూ!’ అని కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ధ్వని భానుశాలి, అభిమన్యు దస్సాని నటించిన ‘సప్నే మే మిల్తీ హై’ అనే పాట రీమేక్ వర్షన్‌లో తాను అతిథి పాత్రను పోషించినందుకు ‘రామ్‌గోపాల్ వర్మ నన్ను ఫోన్ ద్వారా తిట్టారండి బాబు’ అన్నారు.

ప్రముఖ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆయన అనేక మంది స్టార్‌లు కావడానికి సాయపడ్డారు కూడా. ఇటీవల ఎంఎం. కీరవాణి ఆస్కార్ గెలిచిన క్రెడిట్‌నంతా రామ్‌గోపాల్ వర్మకే ఇచ్చారు. కీరవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రామ్‌గోపాల్ వర్మనే నా మొదటి ఆస్కార్’ అన్నారు.

నటుడు మనోజ్ బాజ్‌పేయి ‘సత్య’, ‘కౌన్’, ‘శూల్’ వంటి చిత్రాల్లో రామ్‌గోపాల్ వర్మతో కలిసి పనిచేశారు. మనోజ్ బాజ్‌పేయి ‘సత్య’ సినిమాలో సపోర్టింగ్ పాత్రలో నటించినందుకు తొలిసారి ‘బెస్ట్ యాక్టర్’ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అదండి ఆర్‌జివితో మనోజ్ బాజ్‌పేయికి ఉన్న అనుబంధం!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News