Saturday, December 21, 2024

డార్క్ కామెడీ, హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

ఆరు సంవత్సరాల విరామం తర్వాత హీరో మంచు మనోజ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్ తో ఎక్కువ ఎనర్జీతో తిరిగి వస్తున్నారు. ’వాట్ ది ఫిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆసక్తికరమైన పోస్టర్ లో చాలా మంది తెలియని వ్యక్తులను ఎదుర్కోవటానికి మనోజ్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ సినిమా కోసం మనోజ్ మేకోవర్ అయ్యారు. “మనోజ్ మంచుతో సినిమా చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. డార్క్ కామెడీ, హై-ఆ క్టేన్ థ్రిల్లింగ్, హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’వాట్ ది ఫిష్’ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము” అని దర్శకుడు వరుణ్ తెలిపారు. ఈ అడ్వెంచర్ సినిమా షూటింగ్ అందమైన టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో 75 రోజుల పాటు జరగనుంది. వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News