Saturday, December 28, 2024

యూపిఎస్‌సి ఛైర్మన్‌గా మనోజ్ సోనీ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యూపిఎస్‌సి ) ఛైర్మన్‌గా విద్యావేత్త మనోజ్ సోనీ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. గుజరాత్ లోని అంబేద్కర్ వర్శిటీ, బరోడా లోని సయ్యాజిరావు వర్శిటీలకు వీసీగా పనిచేసిన ఆయన 2017 జూన్ 28న కమిషన్‌లో సభ్యునిగా చేరారు. ఛైర్మన్ హోదాలో 2022 ఏప్రిల్ 5 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కమిషన్‌లో సీనియర్ సభ్యులైన స్మితా నాగరాజ్ మంగళవారం మనోజ్‌చే ప్రమాణస్వీకారం చేయించినట్టు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. యూపిఎస్‌సిలో ఒక ఛైర్మన్, పదిమంది సభ్యులు ఉంటారు. అయితే ప్రస్తుతం ఐదుగురు సభ్యుల వేకెన్సీ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News