Thursday, January 16, 2025

మళ్లీ ‘మంచు’ మంటలు

- Advertisement -
- Advertisement -

జనరేటర్‌లో విష్ణు చక్కెర పోశారు
అమ్మ పుట్టిన రోజు పేరుతో ఇంట్లోకి..
పోలీసులకు మనోజ్ ఫిర్యాదు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: మంచు మోహ న్‌బాబు ఇంట్లో మరోసారి వివాదం చెలరేగింది. తను ఇంట్లో లేని సమయంలో తన అన్న విష్ణు త న అనుచరులతో కలిసి జనరేటర్‌లో చక్కెరను పోశారని మంచు మనోజ్‌కుమార్ ఆరోపించా రు. విష్ణు, అతడి అనుచరుల నుంచి తన కుటుం బానికి ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీసు లకు ఆదివారం ఫిర్యాదు చేశారు. శనివారం షు టింగ్ ఉండగా తాను బయటికి వెళ్లానని, తన భార్య మౌనిక తన కుమారుడు చదువుతున్న స్కూల్‌లో ప్రొగ్రాం ఉండగా వెళ్లిందని తెలిపారు.

ఈ సమయంలో ఇంట్లో తన తొమ్మిది నెలల కూ తురు, అమ్మ, ఆంటీ, అంకుల్ ఉన్నారని తెలిపా రు. ఈ సమయంలోనే తన సొదరుడు మంచు వి ష్ణు, అతడి అనుచరులు కొండూరు కిరణ్, విజ య్‌రెడ్డి, బౌన్సర్లతో కలిసి తన ఇంట్లోకి వచ్చి త మ తల్లికి కేక్ ఇచ్చారని తర్వాత తన ఇంటిలో ఉ న్న జనరేటర్‌లో చక్కెర కలిపిన డీజిల్ పోశారని ఆరోపించారు. అర్ధరాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో జనరేటర్‌ను ఆన్ చేయగా సరిగా నడవలేదని తెలిపారు.

విద్యుత్ సరఫరాలోఅంతరాయం కలగడంతో గ్యాస్‌తో తమకు ప్రమాదం కలిగేదని ఆవేదన వ్యక్తం చే శారు. తన భద్రత కోసం ఉంటున్న వారిని బెది రించారని, అతడి కుటుంబానికి హాని చేస్తా మని చెప్పారని తెలిపారు.తల్లి పుట్టిన రోజున ఇలా జరగడంతో తన భయ భ్రాంతులకు గురయ్యాన ని తెలిపారు. అధికారు లు సంఘటనపై వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News