ఆదిలాబాద్: స్వస్, లైన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో మనోవిజ్ఞాన యాత్ర పొస్టర్ ను గురువారం ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వారి నివాసంలో ఆవిష్కరించారు. మనో ధైర్యాన్ని నింపేందుకు మన జిల్లాకు విచ్చేస్తున్న మనోవిజ్ఞాన యాత్ర నిపుణులతో 17 నవంబర్ నాడు పిఆర్‌టియూ భవన్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో ఉన్నత శిఖరాలను అంధిరోహించడమే లక్ష్యంగా ప్రారంభమవుతోంది. మిషన్ మనో విజ్ఞాన యాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోని 30 జిల్లాలో 30 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.
ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, ఎడిట్ పాయింట్ అధినేత రమేష్ ఇప్పలపల్లి, ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండ వారి రంగాలకు సంబంధించిన విలువైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ మానసిక, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు మన జిల్లాకే విచ్చేస్తున్న ఈ మనో విజ్ఞాన యాత్ర సెషన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రవేశ రుసుం లేని ఈ ఉచిత సెషన్లలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్వస్ ప్రెసిడెంట్ కరింగులు ప్రణయ, సాయి కిరణ్ రెడ్డి, అక్షయ్, పుర్షోత్తం, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.