- Advertisement -
కైలాస్ మానస సరోవర్ యాత్ర త్వరలో పునఃప్రారంభం కాగలదని భారత్ గురువారం తెలిపింది. ఈ మేరకు పబ్లిక్ నోటీస్ కూడా జారీచేసింది. ఇండియా, చైనా తమ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా కైలాస్ మానస సరోవర్ యాత్రను పునరుద్ధరించబోతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు డెమ్‌చోక్, డెప్సాంగ్‌లోని మిగిలిన రెండు ఘర్షణ పాయింట్ల వద్ద దళాలను ఉపసంహరించుకున్నాయి. ‘కైలాస్ మానససరోవర్ యాత్రపై త్వరలో పబ్లిక్ నోటీసు జారీ చేస్తాము, త్వరలోనే యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది’ అని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రణధీర్ జైస్వాల్ అన్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే కైలాస్ మానససరోవర్ యాత్ర 2020 నుంచి జరగలేదు.
- Advertisement -