Monday, December 23, 2024

త్రిషకు సారీ చెప్పిన మన్సూర్ ఖాన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటి త్రిషపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్ తాజాగా ఆమెకు క్షమాపణ చెప్పారు. తనకు త్రిషపై ఎలాంటి చెడు ఉద్దేశం లేదని అన్నారు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి దీవించాలని అనుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు ఉంచారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. మన్సూర్ పోస్టుపై త్రిష పరోక్షంగా స్పందించారు.‘ తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అత్యున్నతమైనది’ అని అంటూ ఆమె తాజాగా ట్వీట్ చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లు అయింది. మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని,‘ లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నానని,

ఆ సన్నివేశం లేకపోవడంతో బాధ కలిగిందని అన్నారు. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్ మీడియా వేదికగాఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తుందని అన్నారు. ‘లియో’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్, ప్రముఖ హీరో చిరంజీవి, నితిన్, రోజా,రాధిక, గాయని చిన్మయి తదితరులు కూడా మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు. మరో వైపు మన్సూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఆయనపై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో మన్సూర్ ఖాన్ త్రిషకు క్షమాపణ చెప్పడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News