Saturday, January 18, 2025

మంథని శ్రీధర్ బాబుదే

- Advertisement -
- Advertisement -

మహాదేవపూర్: మహాదేవ్ పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి, ఆదివారం వెలుబడిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గ ఎమ్యెల్యే అభ్యర్థి శ్రీధర్ బాబుకు 1,01,796 ఓట్ల రాగా పుట్టా మధుకు 71,321 ఓట్లు వచ్చాయి. 30,475 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో నియోజక వర్గంలోని కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు టపాసులు పేలుస్తూ డాన్స్ లు చేస్తూ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భారీ మెజారిటీతో గెలుపొందిన దుద్దిళ్ల ఐదవ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలందరు విసికి, వేసారి పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారంటీల మెనిఫేస్టోను అమలు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మార్పు వస్తుందని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం హామీలను పూర్తిగా విశ్వసించిన నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. మంథని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కోసం భవిష్యత్తు ప్రణాళిక రూపోందిచి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు తప్పకుండా విజయం సాధిస్తారని నియోజకవర్గ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఐదవ సారి దుద్దిళ్ల ను అసెంబ్లీ కి పంపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News