Monday, December 23, 2024

మిడ్‌మానేరు జలాశయం నుండి నీటిని విడుదల చేసిన మంతి గంగుల

- Advertisement -
- Advertisement -

బోయినిపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌లు సోమవారం మిడ్ మానేరు జలాశయంలోని జలాలను దిగువకు విడుదల చేశారు.

ప్రస్తుతం శ్రీ రాజరాజేశ్వర స్వామి జలాశయంలో 15 టిఎంసిల నీరు ఉంది. లోయర్ మానేరు డ్యాంలో 7టిఎంసిల నీరు ఉంది. ఆగస్టు మాసం సగభాగం ముగిసిన వర్షాలు పడక రైతులు పంటసాగు కోసం దీనంగా ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు. ఈ నేఫథ్యంలో వర్షాభావ పరిస్థితులను అధిగమిస్తు పంట క్షేత్రాలకు సాగుకు జలాలు అందించేందుకు వీలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మిడ్ మానేరు 4 గేట్లను ఎత్తి లోయర్ మానేరు డ్యాంలోకి 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

లోయర్ మానేరు జలాశయం నుంచి త్వరలోనే ఎల్‌ఎండి దిగువకు నీటిని విడుదల చేస్తారు. తద్వారా ప్రభుత్వం పది లక్షల ఎకరాల్లో సాగుకు ఆటంకం కలగకుండా చూస్తుంది. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, మండలంలోని సర్పంచులు, ఎంపిటిసిలు పలువురు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News