Sunday, December 22, 2024

షూటర్ అవుతానని అనుకోలేదు: మను బాకర్

- Advertisement -
- Advertisement -

తాను షూటర్ అవుతానని కెరీర్ ఆరంభంలో ఊహించలేదని భారత స్టార్ క్రీడాకారిణి, ఒలింపిక్ డబుల్ మెడల్ విన్నర్ మను బాకరర్ పేర్కొంది. మొదట్లో కెరీర్‌పై స్పష్టత ఉండేది కాదని, ఎప్పుడూ విభిన్నమైన వాటితోనే ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని అని వివరించింది. భిన్నమైన క్రీడలపై ఆసక్తి చూపించేదాన్ని. కానీ, జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే అని, అది ఆర్థిక స్వతంత్రంగా ఉండాలను కోవడం మాత్రమేనని వివరించింది. ఏదైనా మంచి పని చేయాలను కోవడం, దాని కోసం ఎంత పోటీ ఎదురైనా తట్టుకుని ముందుకు సాగడం తన శైలీని అని తెలిపింది. అలా షూటింగ్‌పై ఆసక్తి పెంచుకుని.. దాన్నే నేర్చుకున్నా అని పేర్కొంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన మను బాకర్ తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News