Wednesday, January 22, 2025

చాలా స్వచ్చమైన కథ

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ స్టొరీ ‘మను చరిత్ర’. ప్రొద్దుటూరు టాకీస్ బ్యానర్‌పై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఈనెల 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో కార్తికేయ మాట్లాడుతూ “ఈ సినిమా ట్రైలర్, టీజర్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా వున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది”అని చెప్పారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ “ఈ సినిమా కోసం దర్శకుడు భరత్ చాలా కష్టపడ్డాడు. చాలా ప్రేమిస్తూ చేసిన స్క్రిప్ట్ ఇది. ఈ సినిమా నటుడిగా ఎన్నో విషయాలు నేర్పించింది”అని అన్నారు.

దర్శకుడు భరత్ పెదగాని మాట్లాడుతూ “మను చరిత్ర చాలా స్వచ్చమైన కథ. ఇందులో మేఘ ఆకాష్ పాత్ర గుర్తుండిపోతుంది. గరిమ ది కూడా చాలా కీలకమైన పాత్ర. శివ నా ఫస్ట్ లవ్ . ఇందులో ఆయన చాలా మందిని ప్రేమిస్తాడు. నేను మాత్రం ఆయన్నే ప్రేమిస్తా”అని తెలిపారు. ఈ వేడుకలో రాజ్ కందుకూరి, అజయ్ భూపతి, బెక్కం వేణుగోపాల్, కొండా విజయ్ కుమార్, శేఖర్ రెడ్డి, రక్షిత్, ప్రగతి శ్రీవాస్తవ్, గరిమ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News