ఒక కేసు నుంచి తప్పించేందుకు రూ.4 లక్షలు డిమాండ్ చేసిన సిఐ ఎసిబికి పట్టుబడ్డాడు. ఖమ్మం ఎసిబి డిఎస్‌పి వై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం….భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో మణుగూరు గుట్ట మల్లారం ప్రాంతంలో ఇటీవల వివాదాస్పద ప్రభుత్వ అమ్మకం విషయంలో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ కేసులో మిగిలిన వ్యక్తులైన బేతంచర్ల వెంకటేశ్వర్లు, కూరాకుల శ్రీనివాస్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేస్తానని బెదిరించి సిఐ సతీష్ కుమార్ నాలుగు లక్షలు డిమాండ్ చేశాడు. నాలుగు లక్షల్లో రూ.లక్ష మధ్యవర్తి అయిన బిగ్ టివి రిపోర్టర్ మిట్టపల్లి గోపి ద్వారా సోమవారం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. నాలుగు లక్షల్లో భాగంగా మరో రెండు లక్షలు మరోసారి చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమే కాకుండా సిఐ సతీష్ కుమార్, మధ్యవర్తి గోపిని అదుపులోకి తీసుకొని వరంగల్ జైలుకు తరలించారు.
ఎసిబి వలలో మణుగూరు సిఐ
- Advertisement -
- Advertisement -
- Advertisement -