Sunday, December 22, 2024

మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర బిజెపిలో చాలాకాలంగా ఉన్న అసంతృప్తి ఇప్పటి పరిణామాలతో మరింత రాజుకొంటోందని బిజెపి జాతీయ కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. తాను పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తలను శుక్రవారం ఆమె తోసిపుచ్చారు. ఇదే దశలో తనకు పార్టీలో నిర్లక్షం ఎదురవుతోందన్నారు. అందుకే రెండు నెలలుగా తాను విశ్రాంతి తీసుకుంటున్నానని అంగీకరించారు. తానే కాదు పలువురు బిజెపి ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నారని, అసంతృప్తిని వెల్లడించడం లేదని , వారికి భయం ఉందన్నారు. పంకజ ముండే మహారాష్ట్ర సీనియర్ నేత దివంగత గోపీనాథ్ ముండే కూతురు.

ఇటీవల ఆమె కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసినట్లు, పార్టీలో చేరికపై మాట్లాడినట్లు ఓ స్థానిక ఛానల్ వార్త వెలువరించింది. దీనిని ఖండించిన పంకజ ఈ ఛానల్‌పై తాను పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. బిజెపి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు ఆమె చెప్పడంపై ఉపముఖ్యమంత్రి, బిజెపి నేత ఫడ్నవిస్ స్పందించారు. చిరకాలంగా ఎన్‌సిపితో బిజెపి రాజకీయ పోరు సాగిస్తూ వచ్చింది. ఈ దశలో ఆ పార్టీ వచ్చి బిజెపి వెంట చేరడాన్ని పార్టీకి చెందిన పలువురు వెంటనే జీర్ణించుకోవడం కుదరదని , ఏది ఏమైనా తాను ఆమెతో మాట్లాడుతానని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News