Saturday, September 21, 2024

కార్పొరేట్ వ్యవస్థలో వైశ్యులకు అనేక కష్టాలు

- Advertisement -
- Advertisement -
ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: గౌరిశెట్టి మునిందర్

హైదరాబాద్: రాష్ట్రంలో బీద వైశ్యులను ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గౌరిశెట్టి మునిందర్ కోరారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో టంగుటూరి రామకృష్ణ, మురంశెట్టి శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడుతూ నేడు వైశ్య సమాజం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుందని పెద్ద పెద్ద కార్పొరేటు వ్యవస్థలో చిన్న వ్యాపారస్తులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైశ్యులు అంటనే వ్యాపారం,  వ్యాపారం అంటనే వైశ్యులు అనే రోజులు పోయాయని నేడు వైశ్యులందరూ వ్యాపారం వదలి తమ జీవనోపాధికి ఇతర వృత్తులు ఎంచుకోవాల్సి వస్తుందన్నారు. వైశ్యులు సమాజానికి సేవ చేయడం తప్ప రాజకీయాలు తెలియదని, నేటి పాలకులు వైశ్యులను నిర్లక్షం చేస్తున్నారని మండిపడ్డారు. ఈకార్పొరేట్ వ్యవస్దలతో చిన్న వ్యాపారస్తులు నెలసరి అద్దెలు, కరెంటు బిల్లు చెల్లించలేని పరిస్దితి ఏర్పడిందన్నారు. ప్రతి ఒకటి ఆన్‌లైన్‌లో వ్యాపారం జరుగుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో బీద వైశ్యులను ఆదుకోవాలని ఆలోచన నేటి రాజకీయ వ్యవస్ధలకు లేకుండా పోయిందన్నారు. వెంటనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News