Wednesday, January 22, 2025

నిజాంకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడారు: తలసాని

- Advertisement -
- Advertisement -

Many fight against Nizam

మెదక్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మెదక్ జిల్లాలో ఎంతో మంది యోధులు ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, డైరీ డెవలప్మెంట్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.  పోలీసులచే తలసాని గౌరవ వందనం స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 17న పురస్కరించుకొని జరిగే జాతీయ సమైక్యత ఉత్సవాల ప్రాధాన్యత ప్రజలకు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. హైదరాబాద్ సంస్థానంగా ఉన్న మనం 1948 సెప్టెంబర్ 17 న విలీనం చేశారని,  హిందు దేవాలయాల్లో పూజలు చేయవద్దని నిజాం చెబితే నైజం సర్కార్ ఆంక్షలను ధిక్కరించి ఆగస్టు 15 న జాతీయ జెండాలను రెపరెపలాడించామని గుర్తు చేశారు. 3 రోజుల పాటు జాతీయ సమైక్యత వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని చెప్పారు.

రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా వంటి బృహత్తర పథకాలు తీసుకొచ్చామని, ఆసరా పథకం ద్వారా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తున్నామని,  దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ద్వారా లక్ష రూపాయలు అందజేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని తలసాని తెలిపారు.  అన్ని విధాలుగా ప్రజలకు సేవలు అందించేందుకు సిఎం కెసిఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. దళిత బంధు పథకం ద్వారా దళిత సమాజం అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని,  తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి , జడ్పి ఛైర్ పర్సన్ హేమలత, జిల్లా కలెక్టర్ హరిశ్, అడిషనల్ కలెక్టర్లు రమేష్, ప్రతిమా సింగ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News