Thursday, November 14, 2024

రక్తదానంతో దాతలకు ఎన్నో అరోగ్య ప్రయోజనాలు : ట్రాఫిక్ సిఐ

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: రక్తదానం వల్ల ఎంతోమంది విలువైన జీవితాలను కాపాడవచ్చని, తద్వారా దాతలకు ఎన్నో ఆరోగ్య ప్ర యోజనాలు లభిస్తాయని ఫలక్‌నుమా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వై.కమల్ కుమార్ అన్నారు. మంగళవారం టీఎస్‌ఆర్టీసి ఫలక్‌నుమా డిపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరై గెలాక్సీ డిగ్రీ కళాశాల ఎండి అసముద్దీన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో వైద్యపరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినా ఇంత వరకు రక్తం తయ్యారు చేయలేకపోతున్నామన్నారు. ఎంతో విలువైన రక్తాన్ని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు దానం చేయాలని కోరారు. ఒక్కరు చేసే రక్తదానం ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రక్తం దానం చేసే దాతలకు ఆరోగ్యపరమైన లాభాలు సిద్ధిస్తాయన్నారు. ప్రతి అక్టోబర్ ఒకటిన జాతీయ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయాలని సూచించారు.

అప్పుడే పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. టీఎస్‌ఆర్టీసి చేపట్టిన రక్తదాన శిబిరాల ప్రయోజనాన్ని అభినందించారు. డిపో ఉద్యోగులు 33 మంది తమ రక్తాన్ని దానం చేశారు. హెచ్‌డిఎఫ్‌సి బంజారాహిల్స్ శాఖ సీనియర్ మేనేజర్ సచిన్‌దయామ ఆధ్వర్యంలో రక్తదాతలకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పి.ఎస్.జాకీర్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్లు కె.రాజయ్య, టి.దయాకర్, పి.సైదులు, డిప్యూటీ సూపరింటెండెంట్ కోదండ, డిపో సిబ్బంది పాల్గొన్నారు.

ఫారూక్‌నగర్ డిపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నారాయణగూడ ఐపిఎం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శశిధర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, కింగ్‌కోటి హాస్పిటల్, వైద్య విధాన పరిషత్‌ల సౌజన్యంతో జరిగిన శిబిరంలో డిపోకు చెందిన 24 మంది ఉద్యోగులు రక్తాన్ని దానం చేశారు. కార్యక్రమంలో ఆ డిపో మేనేజర్ ఎస్.బద్రి నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News