Wednesday, January 22, 2025

అమెరికాలో అమెజాన్ పోటు

- Advertisement -
- Advertisement -

 

న్యూయార్క్ /న్యూఢిల్లీ : అమెజాన్‌లో ఉద్యోగాల కోతతో అమెరికా, కెనడాలలోని వేలాది మంది భారతీయ యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వ్యయభారం తగ్గించుకునే దిశలో ఈ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్‌లో ఇటీవల భారీస్థాయిలో లేఆఫ్ ప్రకటించారు. ఈ క్రమంలో హెచ్ 1 వీసాలతో వర్క్ పర్మిట్ల ద్వారా ఉద్యోగాలలో ఉన్న వారు రోడ్డున పడాల్సి వస్తోంది. తమ వర్క్‌పర్మిట్ వీసాలు కాలం చెల్లే లోగా మరో ఉద్యోగానికి స్పాన్సర్స్ దక్కాల్సిన పరిస్థితిలో కాలం గడుపుతున్నారు. ఉద్యోగాల నుంచి తీసివేతపై ఇంతవరకూ అమెజాన్ కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.

అయితే పలువురు ఉద్యోగులు బర్తరఫ్‌కు గురి అయ్యి సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడు వెలిబుచ్చుకుంటున్నారు. వీసా గడువు తీరితే తమను బయటకు పంపిస్తారని, ఈలోగా ఉద్యోగాలు వెతుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే ట్విట్టర్, మెటా ఇతర భారీ స్థాయి టెక్ కంపెనీల్లో ఉద్యోగాలపై కోత విధించారు. దీనికి తోడు ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో సాగేందుకు సిద్ధం కావడంతో హెచ్ 1 వీసాలపై ఉన్న పలువురు భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఓ అంచనా ప్రకారం అమెజాన్ నుంచి పదివేల మంది ఉద్యోగులను తీసివేసేందుకు రంగం సిద్ధం అయినట్లు వెల్లడైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News