Sunday, November 17, 2024

పలువురు ఐపిఎస్‌లకు పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పి స్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి శనివారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం తొమ్మిది మంది ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పించారు. వారు ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే పదోన్నతి తీసుకుని కొనసాగేలా ఆదేశాలు జారీ చేశారు. హోంగార్డ్ ఐజిగా ఉన్న 1999 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ముత్యాల స్టిఫెన్ రవీంద్రకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజి)గా పదోన్నతి కల్పించారు. అలాగే వెల్ఫేర్ అండ్ సోర్ట్ ఫుల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎడిజిగా ప్రస్తుతం ఉన్న స్థానంలోనే స్టిఫెన్ రవీంద్ర కొనసాగనున్నారు. ఐపిఎస్ రెగ్యులర్ రిక్రూట్ (ఆర్‌ఆర్) 2006 బ్యాచ్‌కు చెందిన ఇంటెలీజెన్స్ డిఐజి కార్తికేయకు ఐజిగా పదోన్నతి కల్పించారు.

స్టేట్ పోలీస్ సర్వీస్ (ఎస్‌పిఎస్) 2006 బ్యాచ్‌కు చెందిన రమేష్ నాయుడు, ఎవి రంగనాథ్, వి. సత్యనారాయణ, బి. సుమతీ, ఎం. శ్రీనివాసులుకు ఐజిలుగా పదోన్నతి కల్పిస్తూ సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీరు ఉన్న స్థానాల్లో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారులు న్యాలకొండ ప్రకాష్ రెడ్డి, డి. జోయల్ డేవిస్‌కు డిఐజిలుగా పదోన్నతి కల్పించారు. ప్రకాష్ రెడ్డి జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ డైరెక్టర్‌గా ఉండ గా, సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. వీరిని అదే స్థానంలో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News