Monday, January 20, 2025

పలువురు టిడిపిలో చేరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ విధానాలను నచ్చి పలువురు టి టిడిపిలో చేరినట్టు ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జీ పి. సాయిబాబా వెల్లడించారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జీ కట్టా వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారని, వీరంతా కూడా జెడియూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి (కంకణాల సుబ్బయ్య) మిత్ర బృందం కావడం గమనార్హం అన్నారు. ఈ సందర్బంగా పి. సాయిబాబా, కట్టా వెంకటేశ్ గౌడ్‌లు మాట్లాడుతూ టిడిపిలో చేరిన వారందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేసిందని ఈ సందర్బంగా వాటిని ప్రస్తావించారు. పార్టీలో చేరిన వారిలో కె.యాదయ్య ముదిరాజ్, భానుప్రసాద్, సురేందర్ గౌడ్ , రమేష్ బాబు, వెంకట్రావ్, రఘువీర్, ముళి తదితరులు ఉన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి. సాయిబాబుతో పాటు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జివిజి నాయుడు, షేక్ ఆరిఫ్, ఎస్‌సి సెల్ ఉపాధ్యక్షులు జోగేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News