Wednesday, April 2, 2025

మల్లు రవికి పలువురు నాయకుల అభినందనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మల్లు రవిని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అభినందనలు తెలిపారు. సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి ప్రభుత్వం కట్టబెట్టిన పదవి సమర్దవంతంగా నిర్వహించి రాష్ట్రానికి మంచిపేరు తేవాలని సూచించారు. అదే విధంగా మాజీ రాజ్యసభ సభ్యులు కె.వి. రామచంద్రరావు కూడా మల్లు రవిని కలిసి ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News