Sunday, February 23, 2025

ఎపిలో బిఆర్‌ఎస్‌లోకి వలసల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖలో పలువురు నేతలు చేరారు. శుక్రవారం విజయవాడ నగర మాజీ మేయర్ తాడి శకుంతల తన అనుచరులతో బిఆర్‌ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎపి శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.

శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు వరలక్ష్మి, ఒబిసి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, పలువురు నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో బిఆర్‌ఎస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. తాడి శకుంతల మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతో పార్టీలోకి చేరినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News