Sunday, December 22, 2024

మీ వంటి వారు ఎందరో వచ్చి పోయారు…

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీపై ధ్వజమెత్తిన స్మృతి ఇరానీ

చెన్నై: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. ‘ఒకవేళ నా మాట రాహుల్ గాంధీ వరకు చేరితే, నేనొకటే చెప్పాలనుకుంటున్నాను ఆయనకు. మీ లాంటి వాళ్లు ఎందరో వచ్చారు, పోయారు;  కానీ హిందుస్థాన్ ఉంది, ఉండింది, ఉంటుంది’ అని శనివారం ఆమె అన్నారు.

చెన్నైలో బిజెపి అభ్యర్థి వినోజ్ పి. సెల్వంకు మద్దతుగా ఆమె చెన్నై జిల్లాలోని వేప్పేరిలో ఉన్న వైఎంసిఏ ఆడిటోరియం వద్ద స్మృతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పూర్తి ఎంత ముఖ్యమైనదో నొక్కి చెప్పారు.

‘దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వాములు ఉన్న చోట, ‘జై శ్రీరామ్’ అన్నందుకే ప్రజలను చంపేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళలో ఇలా జరిగింది. నేడు మనం ప్రభువు శ్రీరామ చంద్రుడికి శిరస్సు వంచే అదృష్టం పొందాము. తేదీని చెప్పాము, మందిరాన్ని నిర్మించాము. ప్రభువు గొప్పతనం చూడండి. ఆయన లేడన్న వారిని కూడా ఆయన రప్పించుకున్నారు’ అని ఇరానీ చెప్పుకొచ్చారు. ‘వారెంతటి మూర్ఖులంటే ఆయన నాయకత్వాన్ని కూడా వారు తిరస్కరించారు’ అన్నారు.

అయోధ్యలో విగ్రహ స్థాపన(ప్రాణ్ ప్రతిష్ఠ) వేడుక 2024 జనవరి 22న జరిగింది. అయితే ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని రాజస్థాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు.  అయితే ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన పార్టీ సభ్యుడిని సైతం ఆరు సంవత్సరాల వరకు కాంగ్రెస్ వెలివేసిందని అన్నారు. అజ్మీర్ లో జరిగిన బహిరంగ సభలో రామ మందిర నిర్మాణం పట్ల సంతోషంగా ఉన్నారా అని ఆయన ప్రజలను అడిగారు.

‘రామ మందిర నిరామణం జరిగింది, మీరు ఆనందిస్తున్నారా, లేదా? ప్రాణ్ ప్రతిష్ఠ ను వ్యతిరేకించడం సరైనదేనా? అంతేకాదు, ఒకవేళ ఎవరైనా ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి  వెళితే కాంగ్రెస్ నుంచి ఆరేళ్లు అతడిని వెలేశారు.  ఈ దేశంలో ఇలా జరుగాలా? రాముడు లేని రాజ్యాన్ని ఊహించుకోగలమా?’’ అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News