Wednesday, January 22, 2025

నేడు పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

Many MMTS trains are canceled today

హైదరాబాద్ : నేడు వివిధ మార్గాల్లో నడవాల్సిన 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు అయ్యాయి. లింగంపల్లి-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడవాల్సిన రైళ్లను ఆపరేషనల్ కారణాలు చూపి రైళ్లను రద్దు చేసింది.

రద్దయిన సర్వీసులు..

లింగంపల్లి-హైదరాబాద్‌ మధ్య 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లను, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబరు గల రైళ్లను రద్దు తెలిపింది.

ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో ఎనిమిది రైళ్లు రద్దు కాగా.. ఇందులో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్లు గల రైళ్లను రద్దు చేసింది. లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 నంబరు గల రైళ్లు రద్దయ్యాయి. వీటితోపాటు సికింద్రాబాద్‌-లింగంపల్లి (47150), లింగంపల్లి-సికింద్రాబాద్‌ (47195) కూడా క్యాన్సల్‌ అయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News