Thursday, January 23, 2025

మోడీ అహాన్ని వదులుకుంటే సమస్యలు పరిష్కారం: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

పుణె: ప్రధాని నరేంద్ర మోడీ తన అహాన్ని వదులుకోగలిగితే దేశాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు పరిష్కారమవుతాయని శివసేన ఎంపి సంజయ్ రౌత్ సూచించారు. బుధవారం పుణెలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కృతిక్ భవన్ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ.. అహాన్ని వీడాలన్న గౌతమ బుద్ధుని ఏకైక సందేశాన్ని అందరూ మనసులో ఉంచుకోవాలని అన్నారు. అహాన్ని వదులుకున్నవారే జీవితంలో విజయం సాధిస్తారని, కాని.. కొందరు మాత్రం అహాన్ని పెంచుకుంటూపోతారని ఆయన అన్నారు. అహాన్ని పక్కనపెడితే సమాజం, రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని, ఈ విషయాన్ని ఎవరైనా నరేంద్ర మోడీకి తెలియచేయాలని రౌత్ వ్యాఖ్యానించారు.

All problems solve if PM Modi sheds his ego: Sanjay Raut

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News