Saturday, November 23, 2024

పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు

- Advertisement -
- Advertisement -

నెన్నెల : మండల కేంద్రంలోని రైతు వేధికలో గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆర్డీవో శ్యామలాదేవిల చేతుల మీదుగా 166 మందికి పోడు రైతులకు 264 ఎకరాల భూమికి పట్టాలు అందజేశారు. పోడు భూములను సర్వే చేసిన అధికారులకు జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను ఎమ్మెల్యే అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవారు ఆర్దికంగా అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక వర్గాల అభ్యున్నతికి లెక్కలు మించి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, వైస్ ఎంపీపీ సుమలత, తహసిల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నరేష్, ఏపీఎం విజయలక్ష్మి, ఏవో ప్రేంకుమార్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఇబ్రహీం, రైతు సమన్వయ సమితి అద్యక్షుడు గడ్డం అశోక్ గౌడ్, ఏఈవోలు రాంచందర్, సుప్రజ, మౌనిక, ఎంపీటీసీలు పురంశెట్టి తిరుపతి, కమల, గొలుసుల శిరిష, ప్యాక్స్ వైస్ చైర్మన్ కొయ్యడ శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు తోట సుజాత, రావుల సత్యనారాయణ,, గొర్లపల్లి బాపు, తిరుపతిరెడ్డి, జాడి శంకర్, మార్కెట్ కమిటి డౌఐరెక్టర్ తోట మధు, బీఆర్‌ఎస్ అద్యక్షుడు సాగర్‌గౌడ్, నాయకులు కొడిపె శంకర్, ప్రతాప్‌రెడ్డి, పాపయ్య, రవిందర్, స్వామిగౌడ్, పంచాయతీ కార్యదర్శులు,రైతులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News