Sunday, January 19, 2025

మరమ్మతు కారణంగా పలు రైళ్ల రద్దు, మరికొన్ని రైళ్ల రీషెడ్యూల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్  : తెలుగు రాష్ట్రాల్లో మరమ్మతు పనుల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్‌లలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన కర్నూల్ సిటీ టు -సికింద్రాబాద్ (17024) రైలు 90 నిమిషాలు, గుంతకల్లు- టు బోధన్ (07671) రైలు 26, 27, 30 తేదీల్లో 120 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దండి టు -నిజామాబాద్ (11409) రైలు, ముద్ఖేడ్- టు నిజామాబాద్, 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిజామాబాద్- టు పందర్పూర్ (01413) రైలు, నిజామాబాద్ టు -ముద్ఖేడ్‌ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ- టు నిజామాబాద్ (07596), నిజామాబాద్- టు కాచిగూడ (07593), నాందేడ్- టు నిజామాబాద్ (07854) రైళ్లు 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, నిజామాబాద్- టు నాందేడ్ (07853) రైళ్లను (3215) రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కడగలపాలెం టు -శావల్యాపురం మధ్య ఇంటర్‌లాకింగ్ పనులు జరగకపోవడంతో ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. గుంటూరు- టు తిరుపతి (17261) రైలు, మార్కాపురం టు -తిరుపతి మధ్య మాత్రమే నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News