Sunday, December 22, 2024

ఈనెల 19, 20వ తేదీల్లో పలు రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : సెంట్రల్ రైల్వే కల్యాణ్ సెక్షన్‌లోని సిఎస్‌టి ముంబై- మసీదు స్టేషన్ల మధ్య ట్రాఫిక్ -పవర్ బ్లాక్ కారణంగా నవంబర్ 19, 20 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్టు, మరికొన్నింటిని దారి మళ్లీంచినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. నవంబర్ 19వ తేదీన హైదరాబాద్- సిఎస్‌టి ముంబై రైలు (12702), సికింద్రాబాద్- సిఎస్‌టి ముంబై (17058), 20న సిఎస్‌టి ముంబై- హైదరాబాద్, (12701), సిఎస్‌టి ముంబై- టు సికింద్రాబాద్ రైలు (17057)ను రద్దు చేశారు.

19, 20 తేదీల్లో హెచ్‌ఎస్ నాందేడ్- సిఎస్‌టి ముంబై (17618), 20,21 తేదీల్లో సిఎస్టీ ముంబై- హెచ్‌ఎస్ నాందేడ్ రైలు (17617), 20న సిఎస్‌టి ముంబై- జాల్నా (12071), జాల్నా -సిఎస్‌టి ముంబై (12072), సిఎస్‌టి ముంబై- ఆదిలాబాద్ రైలు (11402), 19న హెచ్‌ఎస్ నాందేడ్- సిఎస్‌టి ముంబై రైలు (17611), 20న సిఎస్‌టి ముంబై- హెచ్‌ఎస్.నాందేడ్ రైలు (17612)ను, 21వ తేదీన ఆదిలాబాద్- సిఎస్‌టి ముంబై (11401) రైలును రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 20న సిఎస్‌టి ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు (22732) దాదర్ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News