మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు హై అలర్ట్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. పనులు నిర్వహణ సహా ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రైళ్లను రద్దు చేసినట్లు వారు తెలిపారు. ఈ రైళ్ల రద్దు విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ కోసం కొద్దిరోజులుగా విజయవాడ రైల్వే డివిజనలో రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నారు. విజయవాడ డివిజన్‌లో పనుల నిర్వహణతో పాటు ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు పేర్కొన్నారు.
రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…
తెనాలి టు విజయవాడ (07575) రైలు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ- టు తెనాలి (07279) రైలు ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, బిట్రగుంట టు చెన్నై సెంట్రల్ (17237/17238) రైలు 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, బిట్రగుంట టు విజయవాడ (07977/07978) రైలు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఒంగోలు టు విజయవాడ (07576) ఒంగోలు-విజయవాడ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, విజయవాడ టు ఒంగోలు (07461) 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, విజయవాడ టు గూడూరు (17259/17260) 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, గూడూరు టు -విజయవాడ (07458) 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, విజయవాడ టు గూడూరు (07500) 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, గూడూరు టు విజయవాడ (07458 ) 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, 07466/07467 రాజమండ్రి- టు విశాఖపట్నం 9వ తేదీ నుంచి 15 వరకు, 17239/17240 గుంటూరు టు విశాఖపట్నం 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ రైళ్ల షెడ్యూల్‌ను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. వీటితో పాటు 22701/22702 విజయవాడ- టు విశాఖపట్నం (9,10,11,13,14 తేదీల్లో), 07767 రాజమండ్రి- విజయవాడ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, 07459 విజయవాడ టు రాజమండ్రి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, 17219, 17220 మచిలీపట్నం టు విశాఖపట్నం 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, 12743/12744 విజయవాడ టు గూడూరు 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అధికారులు రద్దు చేశారు.
దారి మళ్లీంచిన రైళ్ల వివరాలు ఇలా…
దారి మళ్లీంచిన రైళ్లు విజయవాడ, గుడివాడ – భీనువరం జంక్షన్ మీదగా మళ్లీంచనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 13351 ధన్బాద్- టు అలెప్పీ 9వ తేదీ నుంచి 13 వరకు మళ్లీంపు, 12835 హతియ టు- బెంగళూరు 10వ తేదీ, 12889 టాటా- టు బెంగళూరు 13వ తేదీ, 18111 టాటా- టు యశ్వంత్‌పూర్ 12వ తేదీ, 22837 హతియ- టు ఎర్నాకుళం 9వ తేదీ వరకు దారి మళ్లీంచినట్టు అధికారులు తెలిపారు.
పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు ఇలా…
17281/17282 నర్నాపూర్- టు గుంటూరు (9న తేదీ నుంచి 15 వరకు) విజయవాడ-, గుంటూరుల మధ్య రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 07896 మచిలీపట్నం టు విజయవాడ (9వ తేదీ నుంచి 15 వరకు) విజయవాడ-, రామవరప్పాడుల మధ్య, 07769 విజయవాడ టు మచిలీపట్నం (9వ తేదీ నుంచి 15 వరకు) విజయవాడ టు రామవరప్పాడుల మధ్య, 07863 నర్సాపూర్ టు విజయవాడ 9వ తేదీ నుంచి 15 వరకు విజయవాడ- రామవరప్పాడుల మధ్య, 07866 విజయవాడ టు మచిలీపట్నం 9వ ఏదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడ, రామవరప్పాడుల మధ్య, 07770 మచిలీపట్నం టు విజయవాడ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడ, రామవరప్పాడుల మధ్య, 07283 విజయవాడ టు భీమవరం జంక్షన్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడ టు రామవరప్పాడు మధ్య, 07870 మచిలీపట్నం టు విజయవాడ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విజయవాడ, రామవరప్పాడుల మధ్య, 07861 విజయవాడ టు నర్సాపూర్ 9వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.