Monday, December 23, 2024

పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రకు పలు సంఘాల సంపూర్ణ మద్దతు

- Advertisement -
- Advertisement -
సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ

హైదరాబాద్:  పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు టిజిఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పిఆర్‌టియూటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, అగ్రి కల్చర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, ఎస్‌టియూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి పర్వత రెడ్డి, క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌లు మద్ధతు తెలిపారని సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ తెలిపారు.

సిపిఎస్ ఉద్యోగుల సామాజిక భద్రత కొరకు చేపట్టే ఈ యాత్రలో అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పలు సంఘాల నాయకులతో స్థిత ప్రజ్ఞ గురువారం సమావేశమై తాము చేపట్టనున్న యాత్రకు సంబంధించిన విషయాలను వివరించారు. ఈ సమావేశంలో సిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ , రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యలు దర్శన్ గౌడ్, కోటకొండ పవన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News