Tuesday, December 3, 2024

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Maoist Area Committee member arrested in Kothagudem

కొత్తగూడెం : మావోయిస్టుపార్టీ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు , మరో కొరియర్‌ను చర్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మంగళవారం ఉదయం చర్ల పోలీసులు 141సీఆర్‌పిఎఫ్ బెటాలియన్ అధికారులు గస్తీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ఉన్న ఒక పురుషుడు, ఒక మహిళను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. ఇందులో పద్దం మున్ని, అలియాస్ తెల్లం మున్ని అలియాస్ రాఘో, అలియాస్ రాజీ అలియాస్ నిర్మలగా తేలింది. ఆమె చత్తీస్‌గఢ్ కు చెందిన దండకారణ్య ఏరియా కమిటీసభ్యురాలుగా గుర్తించారు. ఆమె భర్త రాహుల్ డివిసిఎం గా పార్టీలో ఉన్నాడు. చత్తీస్‌గఢ్ లోని బిజాపూర్ జిల్లా గంగలూరు ఏరియాలోని సవనార్ గ్రామానికి చెందినది.

అలాగే ఆమెతో పాటు జర్పులు బన్సీ అనే కాంట్రాక్టర్ ను కూడా అరెస్ట్ చేశారు. అతను కొరియర్‌గా వ్యవహరిస్తున్నాడు. బిజాపూర్ జిల్లా ఆవుపల్లి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. వీరిద్దరి వద్ద నుంచి 50ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 50జిలెటిన్ స్టిక్స్,విప్లవసాహిత్యం లభించాయి. 2011 నుంచి పద్దం ముని మావోయిస్టు పార్టీలో పని చేస్తొంది. 2011నుంచి 14వరకు మిలిషియా సభ్యురాలుగా పని చేసింది. అనంతరం క్రాంతి కారి మహిళా సంఘటన్‌లోకి మార్చారు. బన్నీ ఎల్‌జిఎస్ కమాండర్ నగేష్‌కు కొరియర్ గా పనిచేస్తున్నాడు. విరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చారు. సమావేశంలో భద్రాచం ఏ ఎస్పీ వినిత్, చర్ల సిఐ అశోక్, సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ అధికారి హరిఓం ఖారే పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News